కేటీఆర్ కు ‘బర్త్ డే విషెస్’ చెప్పిన హీరో మంచు మనోజ్!

  • నేడు కేటీఆర్ పుట్టిన రోజు
  • కేటీఆర్ ప్రజానాయకుడని ప్రశంసించిన మనోజ్
  • ఆయన ముక్కుసూటిగా వ్యవహరిస్తారని కితాబు
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు మంచు మనోజ్ ఈరోజు ట్విట్టర్ లో వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ‘ప్రజా నాయకుడు, అత్యుత్తమ నేత, ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తి కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు చాలామందికి స్ఫూర్తి అన్నా’ అని ట్వీట్ చేశారు. ఆయన సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telangana
birthday
TRS
KTR
Twitter

More Telugu News