అనుకున్నదంతా అయింది... కడప ఫ్యాక్షన్ అసెంబ్లీలోకి వచ్చేసింది: అచ్చెన్నాయుడు ఫైర్
- అన్యాయంగా సస్పెండ్ చేశారు
- ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు
- మీడియాతో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు
తాము ఇచ్చిన వీడియోలను కూడా సభలో ప్రదర్శించమంటే ఒప్పుకోలేదని, తనను కావాలనే సస్పెండ్ చేశారని అచ్చెన్నాయుడు అన్నారు. పెన్షన్లపై ప్రశ్నించడమే తన తప్పయిందని, దీనిపై మాట తప్పను - మడమ తిప్పను అని పదేపదే చెప్పే జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా జగన్ నియంత్రణలో ఉంచుకోలేకపోతున్నారని ఆరోపించారు.