మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం నా జీవితంలో చేయలేదు: వైఎస్ జగన్
- ఏం హామీలిచ్చానో అదే చేస్తున్నా
- ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా
- అసెంబ్లీలో హామీల వీడియో చూపిన జగన్
ఈ సమయంలో అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వం చూపిన వీడియోలను తాము చూశామని, తాము ఇచ్చే వీడియోను కూడా ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. వైసీపీ మేనిఫెస్టోపై ఇరుపక్షాల మధ్యా వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో, టీడీపీ 600 హామీలను ఇచ్చిందని, వాటిల్లో ఏ ఒక్కదాన్నీ నెరవేర్చలేదని అధికారపక్ష సభ్యులు విరుచుకుపడ్డారు.