పూరీ జగన్నాథ్, హీరో రామ్ మధ్య గొడవలు... అసలు నిజమేమిటంటే..!
Add ap7am to your home Screen

పూరీ జగన్నాథ్, హీరో రామ్ మధ్య గొడవలు... అసలు నిజమేమిటంటే..!

  • 'ఇస్మార్ట్ శంకర్' ప్రమోషన్ లో కనిపించని రామ్
  • ఫ్యామిలీతో కలిసి విదేశీ టూర్ కు
  • ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమమేనంటున్న సినీ వర్గాలు
ఏదైనా సినిమా విడుదలైతే, దాని ఫలితం ఎలా ఉన్నా, మరుసటి రోజు నుంచే ప్రమోషన్ కార్యక్రమాలు, సక్సెస్ మీట్ లు నిర్వహిస్తూ, హీరో, హీరోయిన్లు, దర్శకుడు బిజీ అయిపోతారన్న సంగతి తెలిసిందే. టీవీ చానెళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు ఇస్తూ, సినిమాను మరింతగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. కానీ, తాను నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా గత వారం విడుదల కాగా, సినిమా ప్రమోషన్ ను పక్కనబెట్టి, రామ్ తన ఫ్యామిలీతో కలిసి విదేశీ టూర్ కు చెక్కేశాడు.

 ఇంకేముంది, దర్శకుడు పూరీ జగన్నాథ్ తో వచ్చిన విభేదాల కారణంగానే, రామ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా టూర్ కు వెళ్లాడని వార్తలు వచ్చాయి. కానీ, ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. తన హాలిడేను రామ్ కొన్ని నెలల క్రితమే ప్లాన్ చేసుకున్నాడట. అది కూడా కుటుంబంతో కలిసి. దాన్ని క్యాన్సిల్ చేసుకోవడం ఇష్టం లేక, సినిమా ప్రమోషన్ బాధ్యతలను పూరీ భుజాలపై ఉంచి రామ్ వెళ్లాడే తప్ప, ఇద్దరి మధ్యా మనస్పర్థలేమీ లేవని అంటున్నారు.
Puri Jagannadh
Ram
Ismart Shanker
Tour

More Telugu News