టీనేజ్ కొడుక్కి తన ఫోన్ ఇచ్చిన తండ్రి.. అక్రమ భాగోతం బట్టబయలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీనేజ్ కొడుక్కి తన ఫోన్ ఇచ్చిన తండ్రి.. అక్రమ భాగోతం బట్టబయలు!

  • ఫోన్ లో మరో మహిళతో సరస సంభాషణలు సాగించిన తండ్రి
  • పొరబాటున ఆడియో రికార్డర్ ఆన్ చేసిన బాలుడు
  • ఆడియోల విషయం తల్లికి చెప్పిన వైనం
బెంగళూరులో ఓ అక్రమ సంబంధం ఆశ్చర్యకరమైన రీతిలో బట్టబయలైంది. నగరానికి చెందిన 43 ఏళ్ల నాగరాజన్ ఓ స్వచ్ఛంద సేవా సంస్థ యజమాని. నాగరాజన్ భార్య స్థానికంగా ఓ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది. వారికి 14 ఏళ్ల టీనేజ్ కుమారుడు ఉన్నాడు. అయితే ఒకరోజు నాగరాజన్ తన ఫోన్ ను కొడుకు అడగడంతో ఇచ్చాడు. ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుతున్న ఆ కుర్రాడు పొరబాటున ఆడియో రికార్డర్ ఆన్ చేశాడు. అందులో రికార్డయిన కొన్ని ఆడియోలు ఆ టీనేజ్ బాలుడ్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి.

తన తండ్రి, మరో మహిళతో అత్యంత సన్నిహితంగా మాట్లాడిన మాటలు అందులో రికార్డయి ఉన్నాయి. వాట్సాప్ చాటింగ్ లోనూ కొన్ని సంభాషణలు బయటపడ్డాయి. ఈ కుర్రాడు వెంటనే వాటిని తన తల్లికి చూపించాడు.  తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆ ఇల్లాలు తెలుసుకుంది. భర్తను నిలదీయడంతో, ఆమెను తీవ్రంగా కొట్టాడు.

ఈ నేపథ్యంలో, ఆ స్కూల్ టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్రమ వ్యవహారం గురించి కుటుంబ సభ్యులకు చెబితే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని బెదిరిస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా, స్టేషన్ బయటే రాజీచేసుకునేందుకు నాగరాజన్ కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.
Smartphone
Banglore

More Telugu News