రసకందాయంలో కర్ణాటకం: బీజేపీ నిరసన.. శాసనసభలోనే నిద్రపోయిన సభ్యులు
- విశ్వాస పరీక్ష జరగకుండానే సభ వాయిదా
- ఆందోళనకు దిగిన బీజేపీ
- మరి కాసేపట్లో సభ ప్రారంభం
గురువారం రాత్రి బీజేపీ సభ్యులు విధాన సభలోనే నిద్రించారు. ఉదయం లేచి కాసేపు వాకింగ్ చేసి కాలకృత్యాలు తీర్చుకున్నారు. మరికాసేపట్లో సభ తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కాంగ్రెస్ నేతలతో సమావేశమైన సిద్ధరామయ్య విప్ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.