చంద్రబాబు హైటెన్షన్ వైర్ లాంటి వ్యక్తి.. పట్టుకోవాలని చూస్తే బూడిదైపోతారు: బాబూ రాజేంద్రప్రసాద్
- మేము నిప్పులాంటి వాళ్లం
- చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వం ఏ తప్పూ చేయలేదు
- తప్పు చేస్తే నిరూపించండి
టీడీపీ హయాంలో కుదుర్చుకున్న పీపీఏల్లో ఎలాంటి అవకతవకలు లేవని, తమను వ్యతిరేకించే బీజేపీ ప్రభుత్వమే స్పష్టం చేసిందని, ఇంత కన్నా ఇంకేమి నిదర్శనం కావాలని అన్నారు. చంద్రబాబు హయాంలో ఏపీకి నాలుగు వేల ఐదు వందల పరిశ్రమలు వచ్చాయని, తద్వారా సుమారు ఐదు లక్షల పదహారు వేల మందికి ఉపాధి లభించిందని సాక్షాత్తూ జగన్ ప్రభుత్వమే చెప్పిందని అన్నారు. ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలే విభేదించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ‘మేము నిప్పులాంటి వాళ్లం. మా చంద్రబాబునాయుడుగారు, తెలుగుదేశం ప్రభుత్వం, అప్పటి మా మంత్రులు ఏ తప్పూ చేయలేదు. చేస్తే..నిరూపించండి’ అని వైసీపీ నేతలకు బాబూ రాజేంద్ర ప్రసాద్ సవాల్ విసిరారు.