పురాతన భవనాలను ఏ ప్రాతిపదికన కూలుస్తారు?: ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత కేసులో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
- నిపుణుల సలహాతోనే కొత్త భవనాల నిర్మాణమన్న ఏజీ
- చారిత్రక జాబితా నుంచి ప్రభుత్వం తొలగించిందని వెల్లడి
- ఏ ప్రాతిపదికన కూలుస్తారని ప్రశ్నించిన హైకోర్టు
ఎర్రమంజిల్లోని భవనాలు చారిత్రక కట్టడాలు కావని, వాటిని చారిత్రక జాబితా నుంచి ప్రభుత్వం తొలగించిందన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు పురాతన భవనాలను ఏ ప్రాతిపదిక ప్రకారం కూలుస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకసారి పరిరక్షణ కట్టడాల పరిధిలోకి వచ్చాక వాటిని ఆ జాబితా నుంచి ఎలా తొలగిస్తారు? వాటిని పరిరక్షించాలని నిబంధనలు చెబుతున్నాయి కదా? అని వ్యాఖ్యానించింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని నిబంధనల ప్రకారమే ప్రభుత్వం కూడా నడుచుకోవాలని సూచించింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.