Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మైదానంలో చిరుతల్లా కదులుతున్న న్యూజిలాండ్ ఆటగాళ్లు... 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్

  • కష్టాల్లో ఇంగ్లాండ్ జట్టు
  • వికెట్ల టపటపా
  • కట్టుదిట్టంగా బంతులేస్తున్న కివీస్ బౌలర్లు
వరల్డ్ కప్ టైటిల్ ను గెలవాలన్న కసితో ఉన్న న్యూజిలాండ్ ఆటగాళ్లు బౌలింగ్, ఫీల్డింగ్ అంశాల్లో సర్వశక్తులు ధారపోస్తున్నారు. 242 పరుగుల లక్ష్యఛేదన కోసం బరిలో దిగిన ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అద్భుతంగా నిలువరిస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా వదిలిపెట్టకుండా ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ ను పెవిలియన్ చేర్చుతున్నారు. ఇప్పటివరకు ఇంగ్లాండ్ 4 కీలకమైన వికెట్లు చేజార్చుకుంది. 25 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు సాధించింది 93 పరుగులే. ఇంకా విజయానికి 25 ఓవర్లలో 149 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు మాత్రమే ఉన్నాయి.
England
New Zealand
World Cup
Final

More Telugu News