ఇదేమైనా చేపల మార్కెటా?: టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం
- ప్రజలు చూస్తున్నారని గమనించాలి
- హుందాగా సభను నడిపించాలని భావిస్తున్నా
- ప్రతి ఒక్కరూ సహకరించాలన్న స్పీకర్
ముఖ్యమంత్రి, విపక్ష నేత మాట్లాడేవేళ, వారికి ఎవరూ అడ్డుతగల వద్దని కోరారు. సభను తాను హుందాగా నడిపించాలని కోరుకుంటున్నానని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తమ్మినేని వ్యాఖ్యానించారు. అంతకుముందు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ, సీఎం జగన్ మాట్లాడితే, ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందన్న భయంతోనే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ సభ్యులు కంట్రోల్ తప్పరాదని, వారు హద్దులు దాటితే మాత్రం చూస్తూ ఊరుకోబోయేది లేదని అన్నారు.