'మోజో' టీవీ మాజీ సీఈఓ రేవతి అరెస్ట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మోజో' టీవీ మాజీ సీఈఓ రేవతి అరెస్ట్

  • గతంలో రేవతిపై నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు
  • విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • బంజారాహిల్స్ స్టేషన్ కు తరలింపు
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ చానెల్ మోజో టీవీ మాజీ సీఈఓ రేవతిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కాగా, విచారణ నిమిత్తం ఆమెను అదుపులోకి తీసుకున్నామని బంజారాహిల్స్‌ పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఈ ఉదయం రేవతి ఇంటి వద్దకు వచ్చిన పోలీసులు, అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించి, అక్కడి నుంచి నేరుగా ఆమెను పోలీసు స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం ఆమెపై వచ్చిన ఆరోపణలపై అధికారులు విచారిస్తున్నట్టు సమాచారం. రేవతి అరెస్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Mojo
Revati
Arrest
Ex CEO

More Telugu News