ఎలాంటి వాళ్లను తయారు చేశావయ్యా చంద్రబాబూ?: జగన్ వ్యంగ్యాస్త్రాలు

  • జగన్ ప్రసంగాన్ని అడ్డుకున్న విపక్ష ఎమ్మెల్యేలు
  • కనీసం వినాలన్న ధ్యాస కూడా లేదని జగన్ మండిపాటు
  • టీడీపీలో రౌడీలు, గూండాలేనని ఎద్దేవా
తన ప్రసంగాన్ని పదేపదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్న వేళ, సీఎం జగన్ తీవ్రంగా మండిపడ్డారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. జగన్ ప్రసంగాన్ని ఆయన అడ్డుకోబోగా, "ముఖ్యమంత్రిగా ఇటువైపు నుంచి మా వర్షన్ మేము ఇస్తావుంటే... కనీసం వినాలన్న ధ్యాస కూడా లేకుండా మీరేం చేస్తావున్నారు? ఇదే మేము చేసివుంటే... మీ చంద్రబాబునాయుడు మాట్లాడివుండేవారా? మీరు మాట్లాడివుండేవారా?... ఏం...ఏం...ఏం ఏమయ్యా?... ఏమి? పర్చూరనుకున్నారా? శాసనసభ ఇది. ఎట్లాంటి వాళ్లను తయారు చేశారయ్యా మీరు... నాకు అర్థం కావడం లేదు. మొత్తం రౌడీలను, మొత్తం గూండాలను తయారు చేసుకుని వచ్చినారు" అంటూ వైఎస్ జగన్ వ్యంగ్యాస్త్రాలను సంధించారు.
Go Back to Shorts
Jagan
Andhra Pradesh
Assembly
Chandrababu

More Telugu News