స్పీకర్ తో సమావేశానికి హాజరు కారాదని చంద్రబాబు నిర్ణయం!

  • నేడు ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశం
  • హాజరు కానున్న జగన్, బుగ్గన తదితరులు
  • టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, రామానాయుడు!
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన నేడు జరగనున్న బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశానికి హాజరు కాకూడదని విపక్ష నేత చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో పార్టీ తరఫున అచ్చెన్నాయుడు, రామానాయుడులను పంపాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అధికార పక్షం తరఫున సీఎం జగన్ తో పాటు, ఆర్థిక మంత్రి బుగ్గన, మరికొందరు మంత్రులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ సందర్భంగా, సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలను ఈ బీఏసీ ఖరారు చేయనుంది. కాగా, గతం కంటే భిన్నంగా అసెంబ్లీ సమావేశం కావడానికి ఒకరోజు ముందే బీఏసీ భేటీ జరుగుతుండటం విశేషం. మామూలుగానైతే, అసెంబ్లీ సమావేశాల తొలిరోజు ఈ సమావేశం జరుగుతుంది. 
Go Back to Shorts
Andhra Pradesh
BAC
Assembly
Chandrababu
Jagan
Tammineni Seetaram

More Telugu News