బంజారాహిల్స్ రహదారిపై ఖరీదైన కారు దగ్ధం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బంజారాహిల్స్ రహదారిపై ఖరీదైన కారు దగ్ధం

  • రోడ్ నం.14లో ఘటన
  • స్థానిక వ్యాపారికి చెందిన కారు
  • అందరూ చూస్తుండగా కాలిపోయిన వైనం
హైదరాబాద్ లోని సంపన్నుల నివాసప్రాంతంగా పేరుగాంచిన బంజారాహిల్స్ లో ఓ ఖరీదైన కారు అగ్నికి ఆహుతైంది. రోడ్ నం.14లో రేంజ్ రోవర్ కారు మంటల్లో చిక్కుకుని కొద్ది వ్యవధిలోనే దగ్ధమైంది. స్థానికంగా నివాసం ఉండే పునీత్ అనే వ్యాపారికి చెందిన కారుగా పోలీసులు దీనిని గుర్తించారు. ఈ రేంజ్ రోవర్ కారులో పునీత్ డ్రైవర్ సోము జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్దకు వెళ్లి తిరిగొస్తుండగా కారు ఉన్నట్టుండి నిలిచిపోయింది. డ్రైవర్ కారు దిగి ఇంజిన్ ను తనిఖీ చేయగా, అక్కడ మంటలు కనిపించాయి.

 దాంతో భయాందోళనలకు గురైన డ్రైవర్ సోము వెంటనే ఈ విషయాన్ని తన యజమానికి తెలియజేశాడు. అంతేగాకుండా, ఫైర్ డిపార్ట్ మెంట్ కు కూడా సమాచారం అందించాడు. కానీ, అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి కారు అత్యధికభాగం కాలిపోయింది. ఈ ఘటన కారణంగా బంజారాహిల్స్ రోడ్ నం.14లో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితి చక్కదిద్దుతున్నారు.
Hyderabad
Banjara Hills
Range Rover

More Telugu News