సీఎం జగన్ కు గన్నవరం ఎమ్మెల్యే వంశీ లేఖ

  • పోలవరం కుడికాల్వలోని మోటార్లకు విద్యుత్ సరఫరా చేయాలి
  • 500 మోటార్లు ప్రభుత్వానికి ఇస్తాను
  • రైతుల సౌలభ్యం కోసం మోటార్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి
పోలవరం కుడికాల్వలోని మోటార్లకు విద్యుత్ సరఫరా చేయాలని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోరారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్ కు ఆయన ఓ లేఖ రాశారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా వచ్చే నీటిని రైతులకు దక్కేలా సాయం చేస్తానని, 500 మోటార్లు ప్రభుత్వానికి ఇస్తానని ఆ లేఖలో పేర్కొన్నారు. గతంలో తాను ఏర్పాటు చేసిన మోటార్లకు ప్రభుత్వం నాలుగేళ్లుగా విద్యుత్ సరఫరా చేసిందని గుర్తుచేశారు. రైతుల సౌలభ్యం కోసం మోటార్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని తన లేఖలో వంశీ కోరారు.
Go Back to Shorts
Cm
Jagan
Gannavaram
mla
Vallabhaneni

More Telugu News