అమరావతిలో దొంగలు పడ్డారు.. ఇసుక, స్టీలు కొట్టేశారు.. సామాన్లన్నీ పట్టుకెళ్లిపోతున్నారు!: నారా లోకేశ్
- రూ.200 ఉన్న పెన్షన్ ను చంద్రబాబు రూ.2 వేలు చేశారు
- అయితే రూ.వెయ్యి నుంచి రూ.2,250 పెంచినట్లు వైసీపీ ప్రచారం చేసుకుంటోంది
- ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చారు.. అంతా మునిగిపోయింది
అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయాయి. ఇప్పుడు క్రికెట్ సీజన్ నడుస్తోంది. ప్రజలంతా టీవీల దగ్గర ఉంటారు. ఏపీలో ఇప్పుడు అభివృద్ధి పనులన్నీ క్రికెట్ వికెట్లు పడినట్లు ఆగిపోతున్నాయి. పోలవరం పనులు జరగడం లేదు. అమరావతిలో పనులు ఆగిపోయాయి.
అమరావతిలో ఇప్పుడు దొంగలు పడ్డారు. ఇసుక కొట్టేశారు. స్టీలు కొట్టేశారు. సామాన్లన్నీ పట్టుకెళ్లి పోతున్నారు. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి.. ఇవ్వండో.. ఇవ్వండి.. ఇవ్వండి.. ఇవ్వండి అని చెప్పడంతో ఈ ప్రభుత్వం వచ్చింది. ఒక్క అవకాశం ఇచ్చినందుకు అంతా మునిగిపోయింది’ అని దుయ్యబట్టారు. చివరికి గవర్నర్ ప్రసంగంలో అమరావతి అనే పదమే లేదని విమర్శించారు.