అవును.. రాజీనామా పత్రాలన్నీ చింపేశా: కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్
- నా పార్టీని, మిత్రులను కాపాడుకునేందుకు ఆ పని చేశా
- జరుగుతున్న పరిణామాలు షాక్ కు గురి చేస్తున్నాయి
- రాజీనామా చేసిన వారు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నా
'అవును. రాజీనామా పత్రాలను చింపేశాను. కావాలనుకుంటే నా మీద ఫిర్యాదు చేసుకోవచ్చు. ఎంతో రిస్క్ తీసుకున్నా. నా పార్టీని, నా మిత్రులను కాపాడుకునేందుకే ఇదంతా చేశా' అని శివకుమార్ చెప్పారు. రాజీనామా చేసిన వారు ఏవో కథలు చెబుతున్నారని... వారు రాజీనామా చేసేందుకు అవి సరైన కారణాలు కాదని అన్నారు. జరుగుతున్న పరిణామాలు షాక్ కు గురి చేస్తున్నాయని చెప్పారు. ఇంకా సమయం ఉందని... వారు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్టు తెలిపారు. లేని పక్షంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు.