కృష్ణా జిల్లాలో ఫ్యామిలీ పేరుతో అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఫ్లాటు.. అమ్మాయిలతో వ్యభిచార దందా
- అమ్మాయిలు వచ్చి పోతుండడంతో స్థానికుల అనుమానం
- శుక్రవారం రాత్రి కూడా ముగ్గురు అమ్మాయిలు
- దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ ఒడుగూరి నారాయణ వీరికి తనవంతు సాయం అందించాడు. అపార్ట్‌మెంట్‌కు తరచూ అమ్మాయిలు, అబ్బాయిలు వస్తుండడంతో స్థానికులు అనుమానించారు. శుక్రవారం రాత్రి కూడా ముగ్గురు అమ్మాయిలు ఫ్లాట్‌కు రావడంతో వారి అనుమానం మరింత బలపడింది. వెంటనే వారు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు అపార్ట్‌మెంట్‌పై దాడిచేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.