చిన్నారిని కిడ్నాప్ చేసి పారిపోతున్న వ్యక్తికి స్థానికుల దేహశుద్ధి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిన్నారిని కిడ్నాప్ చేసి పారిపోతున్న వ్యక్తికి స్థానికుల దేహశుద్ధి

  • తల్లితో కలిసి కదిరి వెళ్లిన చిన్నారి
  • కిడ్నాపర్‌ను పోలీసులకు అప్పగించిన స్థానికులు
  • స్థానికులే తన బిడ్డను రక్షించారంటున్న తల్లి
ఓ చిన్నారిని ఎత్తుకుని పారిపోతున్న కిడ్నాపర్‌ను స్థానికులు అడ్డుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన కదిరిలో జరిగింది. తన తల్లితో కలిసి కదిరి వెళ్లిన చిన్నారిని బస్టాండ్ సమీపంలో పిల్లలను అపహరించే ముఠా సభ్యుడు కిడ్నాప్‌ చేయడానికి యత్నించాడు. విషయాన్ని గమనించిన ప్రయాణికులు కిడ్నాపర్‌ను పట్టుకుని చితకబాది చిన్నారిని తల్లికి అప్పగించారు. అనంతరం కిడ్నాపర్‌ను పోలీసులకు అప్పగించారు. తాను కదిరి వచ్చినప్పటి నుంచి కిడ్నాపర్ తనను వెంబడిస్తున్నట్టు చిన్నారి తల్లి తెలిపింది. తన బిడ్డను స్థానికులే రక్షించారని పేర్కొంది.
Kadiri
Kidnap
Police
Bustand

More Telugu News