పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్... కీలక వ్యాఖ్యలు
- నాపై దాడి జరుగుతోంది.. పోరాటాన్ని ఎంజాయ్ చేస్తున్నా
- గతంలో కంటే 10 రెట్లు ఎక్కువగా పోరాడతా
- కోర్టులో తానేమీ మాట్లాడలేదన్న రాహుల్
బెయిల్ లభించిన అనంతరం రాహుల్ గాంధీ కోర్టు హాలు నుంచి వెలుపలకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, తనపై దాడి జరుగుతోందని... అయితే, ఈ పోరాటాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నానని చెప్పారు. తనది సిద్ధాంతాలతో కూడిన పోరాటమని చెప్పారు. పేదలు, రైతులకు అండగా తాను ఉంటానని తెలిపారు. తన పోరాటం కొనసాగుతుందని... గత ఐదేళ్లలో తాను చేసిన పోరాటం కంటే ఇకపై 10 రెట్లు ఎక్కువగా పోరాడుతానని చెప్పారు. కోర్టులో తాను ఏమీ మాట్లాడలేదని... విచారణకు హాజరుకావడానికి మాత్రమే వచ్చానని తెలిపారు.