టాస్ గెలిచిన టీమిండియా.... ముగ్గురు వికెట్ కీపర్లతో బరిలోకి!
- బర్మింగ్ హామ్ లో బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- జాదవ్ స్థానంలో దినేశ్ కార్తీక్ కు చోటు
- కుల్దీప్ బదులు భువనేశ్వర్ కుమార్
ఇక, ఇంగ్లాండ్ తో మ్యాచ్ సందర్భంగా భారీ షాట్లు ఆడేందుకు బాగా ఇబ్బందిపడిన కేదార్ జాదవ్ కు బంగ్లాదేశ్ తో ఆడే తుదిజట్టులో స్థానం దక్కలేదు. జాదవ్ స్థానంలో దినేశ్ కార్తీక్ జట్టులోకి వచ్చాడు. దినేశ్ కార్తీక్ రాకతో టీమిండియాలో ముగ్గురు వికెట్ కీపర్లకు స్థానం దక్కినట్టయింది. ఇప్పటికే ధోనీ, పంత్ ఆడుతుండగా, వాళ్లకు తోడు డీకే కూడా ఎంటరయ్యాడు. ఇక, బంగ్లాదేశ్ విషయానికొస్తే, కీలక ఆటగాడు మహ్మదుల్లా ఫిట్ నెస్ నిరూపించుకోలేకపోవడంతో షబ్బీర్ రెహ్మాన్ కు అవకాశం లభించింది.