జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. సింగపూర్‌కు విమాన సర్వీసులు రద్దు

  • జూన్ నెలాఖరుతోనే ముగిసిన ఒప్పందం
  • పొడిగింపునకు ముందుకు రాని ఏపీ సర్కారు
  • నిలిచిపోయిన సేవలు
ఏపీలోని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి విజ్ఞప్తితో అమరావతి-సింగపూర్ నగరాల మధ్య గతేడాది డిసెంబరులో ప్రారంభమైన విమాన సేవలను రద్దు చేసింది. వీజీఎస్ (వయబులిటీ గ్యాప్ ఫండింగ్) విధానంలో ప్రభుత్వంతో ఇండిగో సంస్థ చేసుకున్న ఈ ఒప్పందాన్ని తాజాగా ఏపీ సర్కారు రద్దు చేసింది. జూన్ చివరి నాటికే ఒప్పందం ముగిసినా ఒప్పందం పొడిగింపునకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో ఇండిగో సంస్థ తమ సేవలను నిలిపివేసింది.
Go Back to Shorts
Andhra Pradesh
Jagan
Indigo
singapore

More Telugu News