భారీ వర్షాలకు ముంబయి ఎయిర్ పోర్టులో చేపలు ప్రత్యక్షం!
- లోతట్టున ఉన్న ఎయిర్ పోర్టు ప్రాంతం
- భారీ వర్షాలకు పొంగిన సమీపంలో ఉన్న సరస్సు
- ఎయిర్ పోర్టు నీటిలోకి చేపలు ప్రవేశం
ముంబయి ఎయిర్ పోర్టు మిగతా ప్రాంతాలతో పోలిస్తే కాస్త లోతట్టు ప్రాంతమేనని, వర్షా కాలంలో ఇక్కడికి సమీపంలో ఉన్న సరస్సు పొంగి అందులో ఉన్న చేపలు కొట్టుకువస్తుంటాయని ఓ సీనియర్ పైలెట్ వివరించారు. అయితే, అలా వచ్చిన చేపల్లో అత్యధికం క్యాట్ ఫిష్ లే కావడంతో ఎవరూ పట్టుకునేందుకు ఆసక్తిచూపడంలేదు. క్యాట్ ఫిష్ లు తింటే అనారోగ్యం అనే ప్రచారం ఉండడంతో వాటిని వీడియో తీశారే తప్ప ఎవరూ పట్టుకోలేదు.