యూపీలోని శాంతి భద్రతలపై ప్రియాంక ట్వీట్.. నేరస్తుల జాబితాతో పోలీసుల కౌంటర్
- 9,225 నేరస్తులను అరెస్టు చేశాం
- నేరాలు 20-30 శాతం తగ్గాయి
- ప్రజల నమ్మకాన్ని సంపాదించుకున్నాం
దీనిపై స్పందించిన యూపీ పోలీసులు రెండేళ్లలో అదుపులోకి తీసుకున్న నేరస్తుల జాబితాతో ప్రియాంక ట్వీట్‌కు సమాధానమిచ్చారు. ఈ రెండేళ్లలో తీవ్రమైన నేరాలకు సంబంధించి 9,225 నేరస్తులను అరెస్టు చేశామని తెలిపారు. రాష్ట్రంలో దోపిడీ, హత్యలు, కిడ్నాపుల వంటి నేరాలు 20-30 శాతం తగ్గాయని పేర్కొన్నారు. నేరస్థుల పట్ల కఠిన చర్యలు తీసుకుంటూ ప్రజల నమ్మకాన్ని సంపాదించుకున్నామని ప్రియాంక ట్వీట్‌కు సమాధానంగా పోలీసులు తెలిపారు.