ఏడేళ్ల చిన్నారిపై మామ వరసయ్యే వ్యక్తి లైంగిక దాడి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏడేళ్ల చిన్నారిపై మామ వరసయ్యే వ్యక్తి లైంగిక దాడి

  • చిన్నారిని భవనంపైకి తీసుకెళ్లి అఘాయిత్యం
  • అనంతరం అక్కడి నుంచి పరారైన నిందితుడు
  • చిన్నారిని ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు
ప్రతి రోజు ఏదో ఒక చోట చిన్నారులపై అత్యాచార ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఏడేళ్ల చిన్నారిపై వరుసకు మామ అయ్యే వ్యక్తే లైంగిక దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్‌లో వెలుగు చూసింది. ఖమ్మం జిల్లాకు చెందిన చిన్నారి కుటుంబం అక్కడి నుంచి వచ్చి బుద్వేల్‌లో నివాసముంటోంది. చిన్నారికి మాయ మాటలు చెప్పి భవనం పైకి తీసుకెళ్లిన సందీప్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సందీప్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సందీప్ రాజేంద్ర నగర్‌లో నైట్ వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. అతడిపై పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. 
Uncle
Rape
Parents
Hospital
Rajendranagar
Police

More Telugu News