రాజధాని అమరావతికి చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌: మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌

  • ఆయన స్థానికంగా నివాసం ఉండాలి
  • తుళ్లూరులో రాజధాని రైతులతో సమావేశం
  • రైతులతో ఒప్పందం ప్రకారం మౌలిక సదుపాయాలు కల్పించాలి
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నవ్యాంధ్ర రాజధాని అమరావతికి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌ అన్నారు. తుళ్లూరులో రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ నివాసంలో ఉంటున్నారంటూ యాగీ చేయడం కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని, ఇది సరైన విధానం కాదన్నారు. చంద్రబాబు రాజధాని ప్రాంతంలో ఉంటేనే రైతులకు, రాజధానికి మేలు జరుగుతుందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. రైతులతో సీఆర్‌డీఏ ఒప్పందం మేరకు కొత్త ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.
Go Back to Shorts
Chandrababu
amaravathi
ex.mla sravan

More Telugu News