ఆ ఫోన్లకు ఇక నో వాట్సాప్!

  • పాత ఆపరేటింగ్ ఫోన్లకు సేవల నిలిపివేత
  • ఐవోఎస్ 7 ఫోన్లకు కూడా
  • పాత అకౌంట్లలో ఖాతాలు తెరవలేరని స్పష్టీకరణ
ఆండ్రాయిడ్‌ 2.3.7 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌)తో పాటు ఐవోఎస్‌ 7 వాడే ఐఫోన్లకు వాట్సాప్ సేవలను నిలిపివేస్తున్నట్టు మెసేజింగ్‌ దిగ్గజం వాట్సాప్‌ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తో నడిచే స్మార్ట్ ఫోన్లకు 2020, ఫిబ్రవరి 1 నుంచి సేవలు ఆగుతాయని తెలిపింది. ఈ ఫోన్లలో కొత్త అకౌంట్లను తెరవలేరనీ, పాత అకౌంట్లను యాక్సెస్‌ చేయలేరని స్పష్టం చేసింది. ఇక విండోస్ ఆపరేటింగ్ ఉన్న యూజర్లకు డిసెంబర్ 31 తరువాత యాక్సెస్ ఉండబోదని పేర్కొంది. జూలై 1 నుంచే మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ నుంచి వాట్సాప్‌ ను తొలగిస్తున్నట్టు వెల్లడించింది. స్మార్ట్ ఫోన్ యూజర్లు ఆండ్రాయిడ్‌ 4.0.3, ఐఓఎస్‌ 8 కన్నా అప్‌ డేటెడ్‌ వెర్షన్లు వాడాలని తెలిపింది. ఆండ్రాయిడ్ల ఫోన్ల కోసం సరికొత్త బీటా వెర్షన్‌ ను అందుబాటులో ఉంచామని, దీనిలో చాటింగ్‌ చేస్తూనే వీడియోలను చూడవచ్చని సంస్థ వెల్లడించింది.
Go Back to Shorts
Android
Whatsapp
Stop
IOS

More Telugu News