కృష్ణతో అత్యధిక సినిమాల్లో నటించిన విజయ నిర్మల .. తిరుపతిలో వివాహం

  • కృష్ణతో కలిసి 47 సినిమాల్లో నటించిన విజయ నిర్మల
  • దర్శకురాలిగా  ‘నేరము-శిక్ష’ చివరి సినిమా
  • తొలి సినిమా ‘రంగులరాట్నం’కి నంది అవార్డు
గత అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందిన ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల తన కెరియర్‌లో అత్యధికంగా సూపర్‌స్టార్ కృష్ణతో ఎక్కువ సినిమాలు చేశారు. మొత్తంగా ఆయనతో కలిసి 47 సినిమాల్లో నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా ‘సాక్షి’. ఈ సినిమా తర్వాత ఇద్దరూ తిరుపతిలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత  ‘అమ్మకోసం’ అనే చిత్రంలో విజయ నిర్మల నటించారు.

మొత్తంగా 44 సినిమాలకు దర్శకత్వం వహించిన విజయనిర్మల 2009లో కృష్ణ హీరోగా ‘నేరము-శిక్ష’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. దర్శకురాలిగా అదే ఆమె చివరి చిత్రం. హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం ‘రంగులరాట్నం’తోనే ఆమెకు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమాకు ఆమె నంది అవార్డు అందుకున్నారు. అలాగే, సినీ రంగంలోని అత్యున్నత పురుస్కారమైన  రఘుపతి వెంకయ్య అవార్డును కూడా విజయనిర్మల అందుకున్నారు.
Go Back to Shorts
vijayanirmla
Tollywood
Super star kirshna
director

More Telugu News