రాష్ట్రాలకు ప్రత్యేక హోదా విషయమై లిఖిత పూర్వక సమాధానమిచ్చిన నిర్మలా సీతారామన్
- ప్రశ్నించిన బీహార్ ఎంపీ కౌసలేంద్ర కుమార్
- ఏడు రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరాయి
- పారిశ్రామిక రాయితీలకు, ప్రత్యేక హోదాకు సంబంధం లేదు
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన సందర్భంగా కూడా ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. అయితే నేడు నిర్మలా సీతారామన్ లోక్సభలో మాట్లాడుతూ, ఇప్పటి వరకూ ప్రత్యేక హోదా కోసం ఏపీ, తెలంగాణ, చత్తీస్గఢ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలు కోరాయన్నారు. ప్రణాళిక మద్దతు కోసమే జాతీయాభివృద్ధి మండలి ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఫారసు చేసిందన్నారు. పారిశ్రామిక రాయితీలకు, ప్రత్యేక హోదాకు సంబంధం లేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.