ఇమ్రాన్ ఖాన్ అంటూ సచిన్ ఫొటో... నవ్వులపాలైన పాక్ ప్రధాని అసిస్టెంట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇమ్రాన్ ఖాన్ అంటూ సచిన్ ఫొటో... నవ్వులపాలైన పాక్ ప్రధాని అసిస్టెంట్

  • ఇమ్రాన్ కు సహాయకుడిగా ఉన్న నయీముల్ హక్
  • ట్విట్టర్ ఖాతాలో సచిన్ ఫొటోను పెట్టి ఇమ్రాన్ అని వ్యాఖ్య
  • వెల్లువెత్తిన విమర్శల వర్షం
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అసిస్టెంట్ నయీముల్ హక్ చేసిన ఓ తప్పు, ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుండగా, పలువురు ట్రోల్ చేస్తున్నారు. తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ ఫొటోను పోస్ట్ చేసిన ఆయన, "1969లో ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌" ఇలా ఉన్నారు అని అన్నారు. ఇది వైరల్ కాగా, ఆయనపై విమర్శల వర్షం కురిసింది. ఎందుకంటే, ఆ ఫొటోలో ఉన్నది సచిన్ టెండూల్కర్. దీంతో నయీముల్ హక్ నవ్వుల పాలయ్యాడు. క్రికెట్‌ దేవుడిగా భావించే సచిన్‌ టెందూల్కర్‌ తొలి నాళ్లలో క్రికెట్ ఆడుతున్న సమయంలో తీసిన ఫొటో ఇది. ఈ ట్వీట్‌ పై కామెంట్ల వర్షమే కురిసింది. ఓ యూజర్‌ దీనిని రీట్వీట్ చేస్తూ, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ పొటో పోస్ట్ చేసి, "పాకిస్థాన్‌ క్రికెటర్‌ సయ్యద్‌ అన్వర్‌" అని వ్యంగ్యంగా క్యాప్షన్‌ పెట్టడంతో అది కూడా వైరల్ అయింది.
Imran Khan
Sachin Tendulkar
Twitter

More Telugu News