సాకారమైన కేసీఆర్ కల... కాళేశ్వరం జాతికి అంకితం!
- తెలంగాణలోని ప్రతి ఎకరానికీ సాగునీరు
- 11.23 గంటలకు కాళేశ్వరం వినియోగంలోకి
- ముగిసిన జల సంకల్ప హోమం
పూర్ణాహుతి సమయానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ హాజరయ్యారు. వీరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అతిథులకు కాళేశ్వరం విశేషాలను స్వయంగా వివరించిన కేసీఆర్, ఆపై వారితో పాటు ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల రిజర్వాయర్లు, నీటి లభ్యత తదితరాలపై ఏర్పాటు చేసిన చాయా చిత్ర ప్రదర్శనను నేతలు తిలకించారు. ఆపై శిలాఫలకాన్ని ఆవిష్కరించడం ద్వారా ప్రాజెక్టు వినియోగంలోకి వచ్చింది.

