వైసీపీ ఎమ్మెల్యే అండదండలతోనే మాపై దాడి చేశారు: డాక్టర్ రమ్య
- ఎస్సీ కులం వారికి ఆసుప్రతి ఎందుకని కించపరిచారు
- ఎమ్మెల్యే గోపిరెడ్డి అండదండలతోనే దాడి జరిగింది
- సీఐ బిలాలుద్దీన్ కూడా వార్నింగ్ ఇచ్చారు
ఈ సందర్భంగా డాక్టర్ రమ్య మాట్లాడుతూ, వైసీపీపై మండిపడ్డారు. ఎస్సీ కులం వారికి ఆసుపత్రి ఎందుకని తమను కించపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీకి ఓటు వేసినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకుంటామని అన్నారు. ఈ దాడి వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి అండదండలతోనే జరిగిందని చెప్పారు. ఆసుపత్రిని ఎలా నడుపుతారో చూస్తానంటూ సీఐ బిలాలుద్దీన్ కూడా వార్నింగ్ ఇచ్చారని అన్నారు.