ఏపీతో ఉల్లాసభరితమైన సంబంధాలు కొనసాగించాలని నిర్ణయించాం: కేసీఆర్
- గతంలో ప్రతిరోజూ వివాదాలే ఉండేవి
- తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పరిస్థితి మారింది
- సుదీర్ఘ సమయంపాటు క్యాబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్
గతంలో పొరుగు రాష్ట్రాలతో అనేక వివాదాలు ఉండేవని, ప్రతి రోజూ బస్తీ మే సవాల్ అన్నట్టుగా ఉండేదని, ఇది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఆ పరిస్థితి మారిందని తెలిపారు. కర్ణాటకతో సమస్యలు సమసిపోయాయని, ఇటీవల మూడుసార్లు పరస్పరం నీళ్లు ఇచ్చిపుచ్చుకోవడం జరిగిందని కేసీఆర్ వివరించారు.