పాక్ ను ఓడించేందుకు సానియా మీర్జా కుట్ర: మండిపడుతున్న ఫ్యాన్స్
- మ్యాచ్ కి ముందు హోటల్ లో క్రికెటర్లు
- సానియాతో పాటు మాలిక్, ఇమాముల్, రియాజ్
- ఎంజాయ్ చేస్తూ గడిపిన వీడియోలు బయటకు
- తిట్టిపోస్తున్న పాక్ క్రికెట్ అభిమానులు
కాగా, ఇండియాతో మ్యాచ్ ముందు ఓ హోటల్ కు వెళ్లిన వీరిలో షోయబ్ సిగరెట్ తాగుతుండగా, మిగతా ఆటగాళ్లు ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు మీడియాలో వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పలు కథనాలు రాగా, సానియా మీర్జా మండిపడింది. వార్త రాసిన విలేకరిని నిందిస్తూ, "ఓడిపోతే భోజనం చేయకూడదా?" అని ప్రశ్నించింది. వాస్తవానికి 12న ఆస్ట్రేలియాతో జరిగిన ఓటమిని దృష్టిలో పెట్టుకుని ఈ టెన్నిస్ స్టార్ ఆ వ్యాఖ్యలు చేసినప్పటికీ, రానున్న మరో ఓటమిని ఆమె ముందే ఊహించిందని పాక్ క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పుడు తూలనాడుతున్నారు.
వీరంతా హోటల్ లో గడిపిన కొన్ని గంటల తరువాత జరిగిన మ్యాచ్ లో సానియా భర్త మాలిక్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే డక్కౌట్ కాగా, ఓపెనర్ గా బరిలోకి దిగిన ఇమాముల్ 7 పరుగులు మాత్రమే చేశాడు. బౌలర్ రియాజ్ 10 ఓవర్లు వేసి ఏకంగా 71 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ముగ్గురి వైఫల్యం తరువాత వీళ్లంతా ఇక క్రికెట్ కు పనికిరారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.