బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జేపీ నడ్డా
- బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయం
- ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం
- జేపీ నడ్డాకు అభినందనలు తెలిపిన నేతలు
ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని అన్నారు. ఐదేళ్ల పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా విజయవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. అమిత్ షా హోం మంత్రి కావడంతో, బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలను మరొకరికి అప్పగించాలన్న ఆయన విజ్ఞప్తి మేరకు, ఈ పదవికి జేపీ నడ్డాను ఎంపిక చేసినట్టు చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా కొనసాగుతారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జేపీ నడ్డాను మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తదితరులు అభినందించారు.
కాగా, నడ్డా హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గతంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగా పని చేశారు. మోదీ ప్రభుత్వంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా నడ్డా పని చేశారు.