టిష్యూ పేపర్ కింద పడిందని పబ్లో యువకులపై దాడి : 9 మందికి గాయాలు
- రెచ్చిపోయి చితగ్గొట్టిన బౌన్సర్లు
- తొలుత వాగ్వాదం...తర్వాత ఘర్షణ
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
వీరిలో కొందరు వాష్రూంకి వెళ్లినప్పుడు టిష్యూ పేపర్ యూజ్ చేస్తుండగా కొన్ని కిందపడ్డాయి. దీన్ని గమనించిన ఓ బౌన్సరు యువకులను ప్రశ్నించాడు. ఈ సందర్భంగా యువకులకు, బౌన్సర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. అప్పుడు ఓ బౌన్సర్ తిట్టడంతో యువకులు గట్టిగా ప్రశ్నించారు. దీంతో మిగిలిన బౌన్సర్లతో కలిపి వీరిపై అతను దాడిచేసి గాయపరిచాడు. ఈ వివరాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. ఈ ఘర్షణలో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు పబ్ యాజమాన్యాన్ని, బౌన్సర్లను ప్రశ్నించినట్లు సమాచారం.