అమానవీయం... తనను కాదన్నదని మహిళా పోలీసును సజీవదహనం చేసిన అధికారి!
- కేరళలోని మావెలిక్కర పరిధిలో ఘటన
- బైక్ ను ఢీకొట్టి, ఆపై గొడ్డలితో దాడి
- పెట్రోల్ పోసి నిప్పంటించిన పోలీసు అధికారి
ఒళ్లంతా నిప్పు అంటుకున్న పరిస్థితిలో సౌమ్య బాధతో ఆర్తనాదాలు చేసింది. ఆమెను చూసిన స్థానికులు మంటలను అదుపు చేయగా, అప్పటికే మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అజాస్ ను అరెస్ట్ చేసి, కేసును విచారిస్తున్నారు. గతంలో వారిద్దరి మధ్యా ప్రేమ వ్యవహారం ఉందని, ప్రస్తుతం అజాస్ ను ఆమె దూరం పెట్టిందని, ఆ కోపంతోనే ఆమెపై దాడి చేశాడని పోలీసులు అంటున్నారు.