తరలివచ్చిన విదేశీ భక్తులు... పుష్కరాలను తలపిస్తున్న కృష్ణా తీరం!
- నేడు రెండో రోజు ఉత్తరాధికారి సన్యాసికారి దీక్ష
- పుష్కరాలను తలపిస్తున్న కృష్ణా తీరం
- పోలీసుల భారీ బందోబస్తు
ప్రకాశం బ్యారేజ్, దుర్గా ఘాట్, భవానీ ఘాట్, ఉండవల్లి కరకట్ట తదితర ప్రాంతాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ కార్యక్రమంలో రేపు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో పాటు, ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, నవీన్ పట్నాయక్ తదితరులు పాల్గొననుండటంతో పోలీసులు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్ని కూడళ్లలో వాహనాల రాకపోకలపై నిఘా పెంచారు.