సొంత పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిపైనే దాడికి పాల్పడిన టీఆర్ఎస్ కార్యకర్తలు
- ఎంపీపీ కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నికలో వివాదం
- 11 స్థానాల్లో 5 టీఆర్ఎస్, 5 కాంగ్రెస్ దక్కించుకుంది
- మిగిలిన ఒక్క స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం
- కాంగ్రెస్కు టీఆర్ఎస్ అభ్యర్థి మద్దతు
ఎంపీపీ కో-ఆప్షన్ సభ్యుడిని ఎన్నుకునేందుకు ఇరువురికీ ఒక్కొక్కరు తగ్గడంతో స్వతంత్ర అభ్యర్థి టీఆర్ఎస్కు మద్దతు తెలిపారు. అయితే అనూహ్యంగా టీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్కు మద్దతు తెలపడంతో మొగుడంపల్లి కో-ఆప్షన్ను కాంగ్రెస్ దక్కించుకుంది. ఊహించని ఈ పరిణామంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్కు మద్దతు తెలిపిన తమ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిపై దాడి చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.