ఎన్టీఆర్ స్టార్ హీరో అవుతాడనే అనుకున్నాను: నటుడు సమీర్

  • ఎన్టీఆర్ తో అలా పరిచయమైంది
  •  'సింహాద్రి'తో ఆయనలోని ఫైర్ బయటికొచ్చింది
  •  'ఆది'తో స్పష్టత వచ్చేసింది 
తాజా ఇంటర్వ్యూలో సమీర్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ ను గురించి ప్రస్తావించాడు. " ఎన్టీఆర్ తో నాకు 'స్టూడెంట్ నెం.1' సినిమా నుంచి పరిచయం వుంది. ఆ తరువాత ఎన్టీఆర్ సినిమాల్లో వరుసగా చేశాను. ఎన్టీఆర్ కబురు చేస్తే ఆయన ఇంటికి వెళ్లేవాడిని .. సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్లం. ఎన్టీఆర్ పెళ్లి జరిగేంతవరకూ ఆయనను ఎక్కువగా కలిసేవాడిని.

షూటింగు లేకపోతే ఎన్టీఆర్ తోనే ఎక్కువగా ఉండేవాడిని.  'స్టూడెంట్ నెం.1' చేసినప్పుడే ఎన్టీఆర్ నటనను ప్రత్యక్షంగా చూశాను. 'సింహాద్రి' సినిమాలో ఆయన నటన ఆశ్చర్యపరిచింది. నటుడిగా ఆయనలో వున్న ఫైర్ చూసి, ఆయన స్టార్ హీరో అవుతాడని అప్పుడే అనుకున్నాను. 'ఆది' సినిమా వచ్చాక ఈ విషయంలో మరింత స్పష్టత వచ్చింది. అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ ఎదుగుతూ వచ్చాడు" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
sameer
ntr

More Telugu News