సియాచిన్‌లో మైనస్ 60 డిగ్రీల ఉష్ణోగ్రత.. సుత్తితో కొట్టినా పగలని గుడ్లు!
- గడ్డకట్టుకుపోతున్న ఆహార పదార్థాలు
- రాయిలా మారిపోతున్న గుడ్లు, టమాటాలు
- కడుపు నింపుకునేందుకు సైనికుల పాట్లు
ఈ వీడియోలో ముగ్గురు జవాన్లు ఆహారాన్ని తీసుకునేందుకు పడుతున్న పాట్లు కనిపిస్తాయి. జ్యూస్ బాక్స్‌ను ఓపెన్ చేస్తే లోపల ఇటుకలా గడ్డకట్టుకుపోయిన రసం కనిపించగా, మరో సైనికుడు దానిని సుత్తితో కొట్టడం కనిపిస్తోంది. దాని తర్వాత గుడ్లను పగలగొట్టేందుకు వారు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. నేలకేసి బలంగా కొట్టినా గుడ్లు పగలడం లేదు. చివరికి సుత్తితో పలుమార్లు బలంగా కొడితే తప్ప పగలడం లేదు. సియాచిన్‌లో పరిస్థితి ఇలా ఉందని ఓ సైనికుడు నవ్వుతూ చెప్పాడు. ఇక, ఉల్లిపాయలు, టమాటాలు, ఆలుగడ్డలు, వెల్లుల్లి పరిస్థితి కూడా ఇదేనని వాపోయాడు.