ఈ సారి డబ్బు .. పేరు రెండూ వస్తాయి: హీరో సప్తగిరి

  • సప్తగిరి నుంచి 'వజ్రకవచధర గోవింద'
  • నాయికగా వైభవీ జోషి పరిచయం
  •  ఈ నెల 14వ తేదీన విడుదల
కమెడియన్ గా తెలుగు తెరపై సందడి చేసిన సప్తగిరి, హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. హీరోగా నిలదొక్కుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'వజ్రకవచధర గోవింద' ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా సప్తగిరి మాట్లాడుతూ .. "బడ్జెట్ పరంగా చూసుకుంటే ఇది చాలా చిన్న సినిమా. కానీ కథాకథనాల పరంగా చూసుకుంటే పెద్ద సినిమా. ఇంతకుముందు నేను చేసిన 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' సినిమాకి డబ్బులొచ్చాయి. 'సప్తగిరి ఎల్ ఎల్ బీ'కి పేరు వచ్చింది. 'వజ్రకవచధర గోవింద' సినిమాకి డబ్బు - పేరు రెండూ వస్తాయనే నమ్మకం వుంది. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ కావాలనీ, ఈ నిర్మాతలు నాతో మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ద్వారా వైభవీ జోషి అనే అమ్మాయి కథానాయికగా పరిచయమవుతోంది.
Go Back to Shorts
saptagiri
vaibhavi joshi

More Telugu News