రేపు సచివాలయంలో అడుగుపెట్టనున్న సీఎం వైఎస్ జగన్!

  • రేపు ఉదయం 8.39 గంటలకు సచివాలయానికి జగన్
  • మొదటి బ్లాక్ లో ఉన్న సీఎం కార్యాలయం
  • రేపు ఉదయమే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. రేపు ఉదయం 8.39 గంటలకు సచివాలయంకు వెళ్లనున్నట్టు సమాచారం. సచివాలయం మొదటి బ్లాక్ లో సీఎం కార్యాలయం ఉంది. ఇదిలా ఉండగా, రేపు ఉదయమే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సచివాలయం సమీపంలోనే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం కేబినెట్ తొలి భేటీ జరగనున్నట్టు సమాచారం.
Go Back to Shorts
Andhra Pradesh
secretariat
cm
jagan

More Telugu News