అందువల్లనే ఈ నిర్ణయానికి వచ్చాను: విజయ్ ఆంటోని
- విజయ్ ఆంటోని తాజా చిత్రంగా 'కిల్లర్'
- విడుదల తేదీగా జూన్ 7
- తెలుగు .. తమిళ భాషల్లో విడుదల
ఈ సందర్భంగా విజయ్ ఆంటోని మాట్లాడుతూ .. "నూతన దర్శకుడు ఆండ్ర్యూ లూయిస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. యాక్షన్ కింగ్ అర్జున్ తో కలిసి నటించడం నాకు చాలా ఆనందంగా వుంది. నా సొంత సినిమాలు ఆడకపోవడం వలన బయట బ్యానర్లలో చేస్తున్నాను . ప్రస్తుతం నా చేతిలో పది సినిమాలు వున్నాయి. కొన్నాళ్లపాటు సంగీతాన్ని కూడా పక్కన పెట్టేసి, పూర్తిగా నటనపైనే దృష్టి పెట్టాలనే నిర్ణయానికి వచ్చాను" అని ఆయన అన్నారు.