తెలంగాణ భవనం ఆవరణలో ఆవిర్భావ దినోత్సవం: పాల్గొన్న కేటీఆర్
- తెలంగాణ తల్లి, జయశంకర్ విగ్రహాలకు నివాళులు
- రాష్ట్ర ప్రజలకు ఇది శుభదినం
- అరవై ఏళ్ల కల నెరవేరిన రోజు
ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలి, తమ జీవితాలు బాగుపడాలని అరవై ఏళ్లుగా ఎదురుచూసిన తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు ఇదని’ ఆనందం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ సాధించుకునేందుకు అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.