ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య!
- కొరియర్ బాయ్‌గా పని చేస్తున్న రమేష్
- పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న హర్షిత, రమేష్
- పెళ్లికి అంగీకరించని ఇరువైపుల పెద్దలు
ఈ క్రమంలోనే తన మేనమామ ఇంటికి ఎదురింట్లో ఉండే హర్షితతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఇరు వైపుల పెద్దలకు విషయం చెప్పగా వారు ససేమిరా అన్నారు. దీంతో హర్షిత ఆత్మహత్యాయత్నం చేసింది. రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హర్షిత మృతి చెందింది. హర్షిత మరణవార్తను విని జీర్ణించుకోలేకపోయిన రమేష్ కూడా ఫతేనగర్‌లోని ఓ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇరు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.