జగన్ ప్రమాణస్వీకారం.. పూలవర్షం కురిపించేందుకు సిద్ధమైన హెలికాప్టర్!
- నేడు నవ్యాంధ్ర రెండో సీఎంగా జగన్
- మధ్యాహ్నం 12.23 గంటలకు ప్రమాణస్వీకారం
- ప్రత్యేక ఏర్పాట్లు చేసిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే
ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మరపురాని వేడుకగా మలిచేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇందుకోసం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఓ హెలికాప్టర్ ను అద్దెకు తీసుకున్నారు. జగన్ ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఆకాశం నుంచి పూలవర్షం కురిపించాలని నిర్ణయించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.