కవిత కోసం రాజీనామా చేస్తా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్
- జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా కవిత పోటీ చేయాలి
- ఆమెను మేము గెలిపించుకుంటాం
- హుజూర్ నగర్ నుంచి ఆమె పోటీ చేయరు
పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి కవిత ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. హుజూర్ నగర్ ఎమ్మెల్యే, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సారి ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో, హుజూర్ నగర్ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత పోటీ చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.