బెంగళూరులో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బెంగళూరులో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం

  • న్యాయంగ లేఅవుట్ లో కనిపించిన తెల్లత్రాచు
  • స్థానికుల విస్మయం
  • చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ మోహన్
పచ్చని వృక్షసీమలకు పెట్టింది పేరైన బెంగళూరు మహానగరంలో అరుదైన శ్వేతనాగు దర్శనమిచ్చింది. సిలికాన్ సిటీలోని న్యాయంగ లేఅవుట్ వద్ద పూర్తిగా తెలుగు రంగులో మెరిసిపోతున్న నాగుపామును చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. సాధారణ నాగుపాముకు భిన్నంగా తెల్లగా కాంతులీనుతున్న ఆ విషసర్పాన్ని చూసిన ప్రజలు వెంటనే ప్రముఖ స్నేక్ క్యాచర్ మోహన్ కు సమాచారం అందించారు. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన మోహన్ ఆ పామును ఎంతో చాకచక్యంగా పట్టుకుని అందరికీ చూపించారు. ఇది చాలా అరుదైన సర్పం అని, ఇలాంటివి సాధారణంగా అడవుల్లో ఉంటాయని తెలిపారు. అనంతరం, ఆ శ్వేతనాగును సమీపంలోని అటవీప్రాంతంలో వదిలిపెట్టేందుకు తీసుకెళ్లారు.
Banglore

More Telugu News