కర్నూలు జిల్లాలో కూలీలకు దొరికిన వజ్రాలు.. రూ.1.4 లక్షలకు కొనుగోలు చేసిన వ్యాపారులు

  • ఇక్కడ భూమిలో వజ్రాలు పుష్కలంగా ఉన్నాయని నమ్మకం
  • జొన్నగిరిలో కూలీలకు దొరికిన వజ్రాలు
  • కొనుగోలు చేసిన స్థానిక వ్యాపారులు
కర్నూలు జిల్లాలోని జొన్నగిరి ఆ జిల్లావాసులకే కాదు.. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకూ చిరపరిచితమే. వర్షాకాలం వచ్చిందంటే స్థానికులతోపాటు చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా ఇక్కడికి జనం పెద్ద ఎత్తున వస్తుంటారు. ఇక్కడి భూమిలో వజ్రాలు ఉన్నాయని ప్రజలు నమ్ముతారు. భూమిలో పాతుకుపోయిన వజ్రాలు వర్షాలు కురిసే సమయంలో బయటకు కనిపిస్తుంటాయి. ప్రతీ వర్షాకాలంలోనూ ఈ ప్రాంతం జాతరను తలపిస్తుంటుంది. జనం నమ్మకం వమ్ముకాకుండా వజ్రాలు దొరికిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.

తాజాగా శుక్రవారం కురిసిన భారీ వర్షానికి రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. పొలం పనులకు వెళ్లిన వ్యవసాయ కూలీలకు ఇవి దొరికాయి. విషయం తెలుసుకున్న స్థానిక వ్యాపారులు ఒక వజ్రాన్ని రూ.1.10 లక్షలకు కొనుగోలు చేయగా, నాణ్యత తక్కువగా ఉన్న మరో వజ్రాన్ని రూ.30 వేలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Kurnool District
jonnagiri
diamonds

More Telugu News